ప్రియుడితో కలిసి సహజీవనం చేస్తున్న శోభ(40) అనే మహిళ అనుమానాస్పద రీతిలో మరణించింది. ఈ ఘటన కర్ణాటకలో చోటుచేసుకుంది. శోభ తన భర్త నుంచి విడిపోయి ఒంటరిగా ఉంటోంది. ఆమెకు మంజునాథ్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఇద్దరు సహజీవనం చేస్తున్నారు. మంజునాథ్ మద్యం తాగొచ్చి శోభతో గొడవ పడేవాడు. ఈ క్రమంలో మంగళవారం ఉదయం శోభ ఉరివేసుకుని కనిపించింది. మంజునాథ్ పరారీలో ఉన్నాడు. శోభ కూతురు పోలీసులకు ఫిర్యాదు చేసింది.