ప్రతి సంవత్సరం కూడా ప్రపంచ పాల దినోత్సవాన్ని జూన్ 1వ తేదిన జరుపుకుంటారు. పిల్లలు, వృద్ధుల ఆహారంలో పాలు ఎంతో ముఖ్యమైనదిగా చెప్పొచ్చు. పాల వల్ల అనేక ప్రయోజనాలున్నాయి. రోజూ పాలు తాగితే ఎముకలకు బలం చేకూరుతుంది. చర్మం కాంతివంతంగా మారుతుంది. చర్మ ఆరోగ్యానికి పాలు బాగా పనిచేస్తాయి. రోజంతా ఎంతో ఉత్సాహంగా ఉండటానికి పాలు ఎంతగానో ఉపయోగపడతాయి. అనారోగ్యంగా ఉన్నవారు పాలు తీసుకుంటే ఆరోగ్యవంతులవుతారు.