కాంగ్రెస్ పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ, పార్టీ ఎంపీ రాహుల్ గాంధీకి బుధవారం ఈడీ సమన్లు జారీ చేసింది. 2015లో దర్యాప్తు సంస్థ మూసివేసిన నేషనల్ హెరాల్డ్ కేసుపై వారికి ఈడీ సమన్లు జారీ చేసింది. రేపు విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. అయితే ఇది కక్ష సాధింపు చర్య అని కాంగ్రెస్ పార్టీ అంటుంది.