ఇండియన్ ఆయిల్ సంస్థ బుధవారం కీలక నిర్ణయం తీసుకుంది. విమానాల్లో ఉపయోగించే ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ (ఏటీఎఫ్) ధరలను తగ్గించింది. ఏటీఎఫ్ ధరను 1.3 శాతం తగ్గించడంతో కిలోలీటర్ రూ. 1.21 లక్షలకు చేరుకుంది. ఈ ఏడాది ధర తగ్గడం ఇదే తొలిసారి. అంతకుముందు మే 16న ఏటీఎఫ్ ధరలను 5 శాతం పెంచడంతో కిలోలీటర్ ధర రూ.1.23 లక్షలకు చేరుకుంది. తాజా నిర్ణయంతో విమానయాన సంస్థలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.