మంకీపాక్స్ ప్రపంచ వ్యాప్తంగా 23 దేశాలకు వ్యాపించడంతో కేంద్ర ఆరోగ్య శాఖ అలర్ట్ అయ్యింది. ఇప్పటి వరకూ సుమారుగా 300కు పైగా మంకీ పాక్స్ కేసులు నమోదవ్వడంతో అంతర్జాతీయ ప్రయాణాలు చేసే వారికి కేంద్ర ఆరోగ్య శాఖ కొన్ని మార్గదర్శకాలు జారీ చేసింది. అడవి జంతువులను తినొద్దని, ఆఫ్రికా జంతు పదార్థాలతో తయారైన క్రీములు, లోషన్లు, పౌడర్లను వాడొద్దని తెలిపింది. అనారొగ్యంతో ఉన్నవారితో సన్నిహితంగా ఉండొద్దని వెల్లడించింది.