ఏపీ పీసీసీ చీఫ్ సాకే శైలజానాథ్‌ను బుధవారం విజయవాడలో పోలీసులు అరెస్టు చేశారు. విజయవాడ నుంచి అమలాపురానికి ఆయన యాత్ర తలపెట్టారు. దానికి అనుమతి లేదని పోలీసులు అడ్డుకున్నారు. ఏపీలో జిల్లాలకు ఎన్టీఆర్, వైఎస్ఆర్ పేర్లతో లేని ఇబ్బంది అంబేద్కర్ పేరుతో ఎందుకు వస్తుందని ఆయన ప్రశ్నించారు. ఏపీ ప్రభుత్వం దురుద్దేశంతో వ్యవహరిస్తోందని ఆరోపించారు.