ఏపీలోని నెల్లూరు జిల్లా ఆత్మకూరు అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగే ఉప ఎన్నికల్లో బీజేపీ పోటీ చేస్తోందని ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు తెలిపారు. ఇందులో భాగంగా ఈ నెల 7వ తేదీన గోదావరి గర్జన పేరుతో రాజమండ్రిలో భారీ బహిరంగ సభను నిర్వహించనున్నారు. ఈ సభకు ముఖ్య అతిథిగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హాజరుకానున్నట్లు తెలిపారు.