మధ్యప్రదేశ్ రాష్ట్రం గ్వాలియర్‌కు చెందిన హరికిషన్ మౌర్యతో దేవికకు 15 ఏళ్ల క్రితం పెళ్లైంది. చాలా ఏళ్లైనా పిల్లలు పుట్టలేదు. దీంతో టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ సాయంతో ఇద్దరు కుమార్తెలకు జన్మనిచ్చింది. అయితే కుమారుడిని కనలేదని భార్యను 2 నెలల క్రితం వదిలి వెళ్లిపోయాడు. పోలీసులను ఆశ్రయించగా, వారి విచారణలో ఆమెకు షాకింగ్ విషయం తెలిసింది. మరో యువతితో భర్త వెళ్లిపోయినట్లు తాజాగా తెలియడంతో రోదిస్తోంది.