రాష్ట్రానికి చెందిన పలు అంశాలపై కేంద్రంతో చర్చించేందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్ర వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ బయలుదేరనున్నారు. గురువారం ఉదయం 11 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి గన్నవరం ఎయిర్పోర్టుకు చేరుకుని.. అక్కడి నుంచి 11:30 గంటలకు హస్తినకు బయలుదేరి వెళ్లనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు ఢిల్లీ ఎయిర్పోర్టు నుంచి వన్ జనపద్కు చేరుకోనున్నారు. సాయంత్రం 4.30 గంటలకు ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశం అవుతారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై ప్రధానితో ముఖ్యమంత్రి జగన్ చర్చించనున్నారు.
ఈ పర్యటనలో ప్రధానంగా పెండింగ్ ప్రాజెక్టులు, పోలవరానికి నిధులు, తదితర అంశాలపై సీఎం జగన్ చర్చించే అవకాశం ఉంది. పలువురు కేంద్రమంత్రుల్ని కూడా కలిసే అవకాశం ఉంది. ఏపీ సీఎం జగన్ దావోస్ పర్యటన నుంచి వచ్చిన రెండు రోజులకే మళ్లీ ఢిల్లీ పర్యటనకు సిద్ధమయ్యారు. ఏప్రిల్లో కూడా ముఖ్యమంత్రి హస్తినకు వెళ్లొచ్చారు. అప్పుడు కూడా రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై ప్రధాని, కేంద్రమంత్రులతో చర్చించారు.