ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విజేతను అభినందించిన మాజీ ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ తాతయ్య

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Jun 02, 2022, 11:29 AM

గుడివాడ ఎన్టీఆర్ స్టేడియం లో జిల్లా స్థాయి పవర్లిఫ్టింగ్ పోటీలు జరిగాయి. ఈ పోటీలలో జగ్గయ్యపేట పట్టణం 15 వ వార్డు చెరువు బజార్ కు చెందిన ముద్ధా శ్రీనివాసరావు-కొండమ్మ దంపతుల రెండవ కుమార్తె తిరుపతమ్మ ఈ పోటీలలో పాల్గొని 57 కేజీల విభాగంలో జూనియర్స్ లో ప్రథమ స్థానం గోల్డ్ మెడల్ ను, సీనియర్స్ లో ప్రథమ స్థానం గోల్డ్ మెడల్ ను తిరుపతమ్మ స్ట్రాంగ్ ఉమెన్ కైవసం చేసుకున్నారు. అదేవిధంగా ఈనెల 8, 9 తేదీలలో గుంటూరు జిల్లా మంగళగిరిలో జరగనున్న రాష్ట్ర స్థాయి పవర్లిఫ్టింగ్ పోటీలకు ఎంపికైన తిరుపతమ్మ ను టీడీపీ జాతీయ కోశాధికారి, మాజీ ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ తాతయ్య అభినందించారు. వార్డు కౌన్సిలర్ గెల్లా సంధ్యారాణి తిరుపతమ్మను శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా శ్రీరాం రాజగోపాల్ తాతయ్యకి, కోచ్ గంటా వెంకటేశ్వర్లుకి తిరుపతమ్మ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇర్రి నరసింహారావు, సంగెపు బుజ్జి, సామినేని మనోహర్, నకిరకంటి వెంకట్, కర్ల జోజి, గెల్లా వైకుంఠరావు, గాలం శ్రీను, షేక్ సుభాని, కొండా కోటయ్య, లింగం నాగేశ్వరరావు, మెటికల రమణ, గండే పుల్లయ్య, అంబోజి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com