విజయవాడ కమిషనరేట్ పరిధిలో జూన్ 5 నుంచి జూలై 24 వరకు 144 సెక్షన్ విధిస్తున్నట్లు పోలీసులు ప్రకటించారు. శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా, ముందస్తు భద్రతా చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పిన పోలీసులు..ఈ సమయంలో నలుగురు లేదా అంతకు మించిజనం గుమికూడరాదన్నారు. కర్రలు, రాళ్లు, ఇతర మారణాయుధాలు పట్టుకుని తిరగొద్దన్నారు. ఈ ఆదేశాలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకుంటామన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa