దాచేపల్లి నగర పంచాయతీ పరిధిలోని ఒక మహిళ చీటీ పాటలు నిర్వహిస్తూ దాదాపు రూ. 3 కోట్ల మేర టోకరా వేసినట్లు బాధితులు బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాచేపల్లి కి చెందిన ఓ మహిళ కొంతకాలంగా స్థానికంగా చీటీపాటలు నిర్వహిస్తుంది. ఈ క్రమంలోనే చీటీల నిర్వహణతో పాటు స్థానికంగానూ చాలా చోట్ల అప్పులు చేసింది. ఇటీవల అధికార పార్టీ నేతలకు సమస్య చెప్పిన పరిష్కారం కాకపోవడంతో ఫిర్యాదు చేసినట్లు బాధితులు తెలిపారు.