నెల్లూరు జిల్లా కావలిలో రైల్వే ఏఎస్సై నరసింహారావు భార్య దుర్గాభవాని(29) మంగళవారం అర్ధరాత్రి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. వారికి పదేళ్ల కిందట వివాహం జరిగింది. ఇద్దరు కుమార్తెలున్నారు. మంగళవారం ఇద్దరి మధ్య వివాదం జరిగిందని, మనస్తాపంతో తన భార్య ఉరివేసుకుందని నరసింహారావు చెప్పాడు. అత్తమామలు అదనపు కట్నం కోసం వేధిస్తున్నారని, అందుకే ఆత్మహత్యకి పాల్పడిందని దుర్గాభవాని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.