ఆగి ఉన్న బస్సు ఎక్కుతూ కాలు జారి పడి మహిళకు గాయాలైన సంఘటన అనంతపురం జిల్లా యాడికిలొ చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు స్థానిక నారాయణ స్వామి కాలనీకి చెందిన రాజమ్మ (45) గుత్తి నుండి తాడిపత్రి కి వెళ్లే బస్సు యాడికి పాత పోలీస్ స్టేషన్ సమీపంలో ఆగి ఉండగా తాడిపత్రి వెళ్లాలని రాజమ్మ బస్సు ఎక్కేందుకు ప్రయత్నించి కాలు జారి పడడంతో తలకు గాయమైంది. దీంతో గమనించిన స్థానికులు వెంటనే ఓ ప్రైవేటు వాహనంలో యాడికి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు.