గుంతకల్లు పురపాలక సంఘం పరిధిలోని దోనిముక్కల రోడ్డు ఏరియాలో జరుగు తున్న జగనన్న కాలనీ ఇళ్ల నిర్మాణాల లబ్దిదారులకు ఇసుకను సక్రమంగా అందించాలని ఆర్డీఓ రవీంద్ర హౌసింగ్ అధికారులను ఆదేశించారు. గురువారం స్థానిక మార్కెట్ యార్డ్ లోని ఇసుక డంపింగ్ ప్రాంతం నుండి ప్రభుత్వం అందిస్తున్న ఉచిత ఇసుక పంపిణీ కార్యక్రమాన్ని ఆయన పరిశీలిం చారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడు తూ జగనన్న కాలనీలలో ఇళ్ల నిర్మాణాల కోసం ప్రభుత్వం లబ్ధిదారులకు ఉచితంగా ఇసుకను అందిస్తోందన్నారు. కావున హౌసింగ్ అధికారులు ఇసుకను సక్రమం గా అందించి ఇళ్ల నిర్మాణం వేగవంతంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.ఆయనతోపాటు మున్సిపల్ చైర్ పర్సన్ ఎన్. భవాని కమిషనర్ బండి శేషన్న, హౌసింగ్ ఎఇ శివారెడ్డి ఉన్నారు.