యాడికి మండలంలోని పెద్ద పేట గ్రామంలో నివసిస్తున్న ఎరుకల పెద్ద లింగన్న ( 65 ) గుండెపోటుతో మృతి చెందాడు. వివరాల మేరకు జులై ఒకటో తారీకు పింఛన్ డబ్బుల కోసం గ్రామ వాలంటీర్ రామకృష్ణ రెడ్డి తో పింఛన్ డబ్బులు రూ. 2500 తీసుకొని ఇంటికి వెళ్ళాడు. ఇంటిలోకి వెళ్లి కూర్చున్న లింగన్న ఒక్కసారిగా గుండెపోటుతో కుప్పకూలిపోయాడు. వెంటనే గమనించిన కుటుంబీకులు లింగన్న ను పైకి లేవనెత్తడానికి యత్నించగా అప్పటికే ప్రాణాలు వదిలినట్లు కుటుంబీకులు తెలిపారు.