మహేశ్వరం నియోజకవర్గం మీర్ పేట్ కార్పొరేషన్ పరిధిలోని 11వ డివిజన్ ప్రశాంతిహిల్సా కాలనీ ఫేజ్-2లో శ్రీ దుర్గాభవాని మాత విగ్రహ పునఃప్రతిష్టాపన కార్యక్రమాన్ని కన్నుల పండువగా నిర్వహించారు. ఈ వేడుకకు విద్యాశాఖా మంత్రి సబితా ఇంద్రారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ తీగల విక్రంరెడ్డి, కార్పొ రేటర్ దోమలపల్లి ధనలక్ష్మీ రాజ్ కుమార్ దంపతులు, కాలనీవాసులు, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.