అవినీతి నిరోధానికి ‘ఏసీబీ 14400 మొబైల్ యాప్’ను సీఎం వైయస్ జగన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, అవినీతి నిర్మూలనకు మరో విప్లవాత్మక మార్పు తెస్తున్నామని అన్నారు. ఎవరైనా, ఎక్కడైనా లంచం అడిగితే మొబైల్లో ఏసీబీ 14400 యాప్ డౌన్లోడ్ చేసుకుని బటన్ నొక్కి వీడియో / ఆడియో సంభాషణ రికార్డు చేసి ఫిర్యాదు చేయండి, ఎవరైనా పట్టుబడితే కచ్చితంగా కఠిన చర్యలు ఉంటాయని అన్నారు.