ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అధిక చక్కెర తీసుకోవడం వల్ల కలిగే దుష్ప్రభావాలు

Health beauty |  Suryaa Desk  | Published : Thu, Jun 02, 2022, 01:25 PM

తెల్ల చక్కెరను టీ, పాలు, కాఫీ, షర్బత్, ఏదైనా తీపి పదార్థాలు తయారీ కోసం కోసం వాడుతారు. కొంతమంది తీపి పదార్థాలు ఎక్కువగా తింటారు. అయితే చక్కెర మీ శరీర బరువును వేగంగా పెంచుతుందనే విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. అదే సమయంలో మీ ఎముకలను చక్కెర బలహీనపరుస్తుంది. డయాబెటిస్‌ కు చక్కెరే ప్రధాన కారణం. అందుకే చక్కెరను వైట్ పాయిజన్ అని అంటారు. చక్కెర శరీరానికి ఎంత హాని చేస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.
- గ్లైకేషన్‌ కు చక్కెర ప్రధాన కారణం. నిజానికి స్వీట్స్ తిన్న తరువాత మన శరీరంలో అప్పటికే ఉన్న చక్కెర కొల్లాజెన్ ప్రోటీన్‌ కు అంటుకుంటుంది. ఇది ప్రోటీన్‌ ను నెమ్మదిగా తొలగిస్తుంది. దాని ప్రభావం చర్మంపై కనిపిస్తుంది. దీంతో ముడతలు చర్మంపై కనిపించడం ప్రారంభిస్తాయి. వృద్ధాప్యం రావడం ప్రారంభమవుతుంది.
- ప్రస్తుత కాలంలో ఊబకాయం పెద్ద సమస్యగా మారింది. స్వీట్లు తినకపోయినా చక్కెర పానీయాలు, శీతల పానీయాలు, చాక్లెట్లు, మొదలైన వాటి ద్వారా చక్కెర మీ శరీరానికి చేరుకుంటుంది. దీంతో మీ బరువు వేగంగా పెరుగుతుంది.
- మీరు చక్కెర తిన్నప్పుడల్లా అది కాలేయం పనిని పెంచుతుంది. దీంతో అది ఒత్తిడికి లోనవుతుంది. ఈ కారణంగా శరీరంలో లిపిడ్లు అధికంగా ఏర్పడి.. కాలేయ సమస్య వచ్చే ప్రమాదం పెరుగుతుంది.
- ఎక్కువ చక్కెర తినడం వల్ల జ్ఞాపకశక్తి కోల్పోయే ప్రమాదం ఉంది. ఎక్కువ చక్కెర మీ శరీరంలో చక్కెర స్థాయిని పెంచుతుంది. ఈ కారణంగా గ్లూకోజ్ పూర్తిగా మెదడుకు చేరదు. ఫలితంగా జ్ఞాపకశక్తి కోల్పోతారు.
- చక్కెర అధికంగా తీసుకోవడం వల్ల గుండెపోటు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. స్వీట్లు ఎక్కువగా తింటే శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరుగుతుంది. దీంతో అధిక బిపి సమస్య వస్తుంది. అలాగే గుండెపోటు, హార్ట్ స్ట్రోక్ పెరిగే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com