భార్యను గొంతు నులిమి చంపేసిన భర్త అనంతరం 100 నెంబర్ కి ఫోన్ చేశాడు. ఈ ఘటన శ్రీకాకుళం జిల్లాలోని పూడివలస గ్రామంలో మంగళవారం రాత్రి జరిగింది. నాగరత్నం(46), రామారావు దంపతులకు 2012లో వివాహమైంది. ఇటీవల భార్య నాగరత్నంపై అనుమానం పెంచుకున్న రామారావు తరచూ ఆమెతో గొడవపడేవాడు. ఈ క్రమంలో మంగళవారం రాత్రి నాగరత్నం గాఢనిద్రలో ఉండగా గొంతు నులిమి చంపేశాడు. పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు.