సింహాద్రిపురం మండలంలో ప్రభుత్వ పనులకు గ్రావెల్ కావాల్సిన వారు ఆర్డిఓ అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని తహసీల్దార్ మహబూబ్బాషా పేర్కొన్నారు. సంబంధిత పూర్తి పత్రాలతో జమ్మలమడుగు ఆర్డీఓ కార్యాలయానికి వెళ్లి సంప్రదిస్తే సింగల్ విండో విధానం ద్వారా పత్రాలను పరిశీలించి అనుమతి ఇస్తారన్నారు. అనుమతి లేకుండా ఎక్కడ పడితే అక్కడ గ్రావెల్ తవ్వకాలు చేపడితే వారిపై చట్టరీత్యా చర్యలు తప్పవని తహసీల్దార్ హెచ్చరించారు.