ఆంధ్రప్రదేశ్ ప్రజలు అలర్ట్. రానున్న మూడు రోజులో రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో భారీ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. జూన్ 3న రాష్ట్రవ్యాప్తంగా ఎండలు ఎక్కువగా ఉంటాయని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది.శుక్రవారం ఏపీలోని 83 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు ఉంటాయని వెల్లడించింది. మరో 157 మండలాలో ఉక్కపోతలు ఉక్కిరిబిక్కిరి అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ విపత్తు నిర్వహణ శాఖ తెలిపింది.