ఢిల్లీ వెళ్లిన ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కొద్దిసేపటి క్రితం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను కలిశారు. ప్రధాని మోదీని కలిసిన అనంతరం జగన్ నేరుగా నిర్మల అధికారిక నివాసానికి వెళ్లారు.రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, అప్పులు, పన్నుల వసూళ్లు, కేంద్రం నుంచి రాష్ట్రానికి అందుతున్న సహకారం, అలాగే అందించాల్సిన సహకారం తదితర అంశాలను జగన్ కేంద్రమంత్రికి వివరించారు.