నల్గొండ జిల్లా నేరడుగొమ్ము మండలం పేర్వాలలో దారుణం జరిగింది. మద్యం మత్తులో తండ్రి కొడుకుల మధ్య అప్పులు ఆస్తి పంపకాలు సరిగా జరపలేదని గొడవ జరిగింది. ఈ క్రమంలో కొడుకు శ్రీనయ్య, తండ్రి వెంకటయ్య(58)ను ఇటుక రాయితో తలపై కొట్టి చంపాడు. అయితే తండ్రీ కొడుకుల మధ్య కొన్నేళ్లుగా మాటలు లేనట్లు తెలుస్తోంది. కాగా నిందితుడు పోలీసుల ఎదుట లొంగపోయినట్టు సమాచారం. గురువారం ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై రాజు తెలిపారు.