నిత్యం మనం పలు కూరల్లో కొత్తిమీరను వేస్తుంటాం. దీని ద్వారా కూరలకు రుచి వస్తుంది. కొత్తిమీరను కూరగా చేసుకున్నా లేదా పచ్చడిగా చేసుకుని తిన్నా అద్భుతంగా ఉంటుంది. కొత్తిమీరలో మన శరీరానికి పనికొచ్చే ఎన్నో ప్రోటీన్లు, విటమిన్లు, లవణాలు, లోహాలు ఉంటాయి. ఈ క్రమంలోనే కొత్తిమీరను నిత్యం వాడడం వల్ల ఎలాంటి ప్రయోజనాలున్నాయి ఇప్పుడు తెలుసుకుందాం.
జీర్ణ సమస్యలను నివారించడంలో కొత్తిమీర బాగా పనిచేస్తుంది. కొత్తిమీర జ్యూస్ ను ఉదయాన్నే పరగడుపున తాగితే గ్యాస్, అసిడిటీ, మలబద్దకం తగ్గుతాయి.
కొత్తిమీర జ్యూస్ ను రోజూ తాగితే శరీరంలో ఉండే విష, వ్యర్థ పదార్థాలు బయటకు వెళ్లిపోతాయి.
కొత్తిమీరలో ఉండే యాంటీ బాక్టీరియల్, యాంటీ వైరల్, యాంటీ మైక్రోబియల్ గుణాలు అన్ని రకాల జ్వరాలను తగ్గిస్తాయి.
కొత్తిమీర జ్యూస్ తాగడం వల్ల పురుషుల్లో శృంగార సామర్థ్యం కూడా పెరుగుతుంది.
జీర్ణకోశంలో గ్యాస్ ఉత్పత్తి కానివ్వదు. సులభంగా మూత్ర విసర్జన జరిగేట్టు చేసి కిడ్నీల ఆరోగ్యానికి కొత్తిమీర దోహదపడుతుంది.
కొత్తిమీర జ్యూస్ తీసుకోవడం వల్ల విటమిన్ ఎ, బి1, బి2, సి లభిస్తాయి. ఐరన్ లోపంతో బాధపడుతున్న వారు కొత్తిమీర జ్యూస్‌ను తాగితే ఫలితం ఉంటుంది.
కొత్తిమీర టీ తాగితే రక్తంలో కొలెస్ట్రాల్, లిపిడ్ లెవల్స్ తగ్గుతాయి. యువతులలో హార్మోన్లు సరిగ్గా పనిచేస్తాయి.