పల్నాడు జిల్లా దుర్గి మండలం జంగమేశ్వరపాడులో ఈరోజు టీడీపీ శ్రేణులపై జరిగిన దాడిపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ నుంచి మరికొంత మందిని పొట్టన పెట్టుకుంటారా అంటూ వైసీపీని అయన ప్రశ్నించారు. ఫ్యాక్షన్ నేపథ్యంతోపాటు నేర మనస్తత్వం వున్న జగన్‌రెడ్డికి ఒక్క చాన్స్ పేరుతో ముఖ్యమంత్రి గద్దెనెక్కిస్తే ఏపీని అరాచకప్రదేశ్‌గా మార్చారని లోకేష్ మండిపడ్డారు. మొన్న సుబ్బయ్య, నిన్న చంద్రయ్య, నేడు జల్లయ్యని అంతం చేసిన మీరు ఇంకెంతకాలం సాగిస్తారు ఆపకపోతే, తీవ్రపరిణామాలుంటాయి. అన్ని బాకీలు సెటిల్ చేస్తాం. మా కార్యకర్తల జోలికొచ్చిన ప్రతి వాడు మూల్యం చెల్లించుకోక తప్పదు.వైసీపీ మూకల దాడిలో ప్రాణాలు కోల్పోయిన జల్లయ్య కుటుంబాన్ని టిడిపి ఆదుకుంటుంది అని తెలిపారు.