పుల్లపుల్లని గోంగూర తెలుగువారికి ఎంతో ప్రీతికరం. పచ్చడి, ఊరగాయ, పప్పు, కూర... ఇలా గోంగూరతో ఏది చేసినా సూపరే. నాన్ వెజ్ కు గోంగూర కలిస్తే .... నెక్స్ట్ లెవెల్ అన్నమాట. గోంగూర వాల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. విటమిన్ సి, ఎ, బి6 తో పాటు ఐరన్, మెగ్నీషియం, పొటాషియం, కాల్షియం పుష్కలంగా దొరుకుతాయి.
గోంగూరను తరచుగా తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తిని పెంచుకోవచ్చు. గోంగూరలో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి శరీరంలో జీర్ణశక్తి పెరిగి, డైజెస్టివ్ సమస్యలు దూరమవుతాయి. గోంగూరలో క్యాల్షియం, ఇనుము సమృద్ధిగా ఉంటాయి దీంతో ఎముకలు పటిష్టంగా తయారవుతాయి. శరీరంలో రక్త ప్రసరణ సజావుగా సాగడానికి గోంగూర సహకరిస్తుంది. రక్తంలో ఇన్సులిన్ స్థాయిని పెంచి, షుగర్ లెవెల్స్ ని తగ్గించే శక్తి గోంగూరకు ఉంది. గోంగూరలో ఫోలిక్ యాసిడ్స్, మినరల్స్ అత్యధికంగా ఉంటాయి. ఇది యాంటీ ఆక్సిడెంట్ గా పనిచేస్తుంది. గుండె, కిడ్నీ వ్యాధులు, కొన్ని రకాల క్యాన్సర్ వంటి భయంకరమైన వ్యాధులను నివారించడానికి గోంగూర సహాయపడుతుంది. గోంగూరను తరచుగా తీసుకోవడం వల్ల కంటి వ్యాధులు వచ్చే అవకాశం తక్కువగా ఉంటుంది. విటమిన్ కె గోంగూరలో పుష్కలంగా లభిస్తుంది.