పల్నాడు జిల్లా, నరసరావుపేట పరిధిలో టీడీపీ కార్యకర్తల మీద , దాడులు ఎక్కువైపోతున్నాయి అని టీడీపీ ఇంచార్జి చదలవాడ అరవింద్ బాబు తెలిపారు. బాధితులకి అండగా ఉండేందుకు ప్రయత్నిస్తున్న మమ్మల్ని ఈ విధంగా అరెస్ట్ చెయ్యడం సమంజసం కాదు అని తెలిపారు. అధికారం ఉందని విర్రవీగిన ఎంతో మంది కాలగర్భంలో కలిసిన ఘటనలు ఎన్నో ఉన్నాయ్, కాబట్టి హద్దులు మీరు ప్రవర్తించడం సరైన పద్దతి కాదు అని ఆయన హెచ్చరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... నా నియోజకవర్గ ప్రజల కోసం, ప్రజల శ్రేయస్సుకోసం, అలుపెరుగని పోరాటం చేస్తుంటే నన్ను నరసరావుపేట ప్రభుత్వ ఆసుపత్రిలోకి వెళ్లనివ్వకుండా బలవంతంగా అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. వైసీపీ ప్రభుత్వం తమ సొంత ప్రయోజనాల కోసం, పోలీసులను వాడుకొని సమస్యలపై పోరాటం చేసే మమ్మల్ని అక్రమంగా అరెస్టు చేయడం చాలా దుర్మార్గం. ప్రజలు గమనిస్తున్నారు? మీరు చేసే అరాచకాలు కు రాబోయే కాలంలో ప్రజలే బుద్ధి చెబుతారు అని హెచ్చరించారు.