07.06.2022 తేదీన పల్నాడు జిల్లాలోని ఓబులునాయుడు పాలెం గ్రామంలో ఏర్పాటు చేసిన జిందాల్ పవర్ ప్లాంట్ ప్రారంభ కార్యక్రమానికి ముఖ్యమంత్రి జగన్ హాజరుకానున్నారు. కాబట్టి ఈ కార్యక్రమానికి తగినంత బందోబస్తు ఏర్పాటు చేసి, భద్రతకు సంబంధించి పటిష్టమైన చర్యలు తీసుకుంటామని ఎస్పీ తెలిపారు. గౌరవ ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించిన రూట్ మ్యాప్ ను పరిశీలించి, చేయవలసిన భద్రత ఏర్పాట్ల గురించి గౌరవ కలెక్టర్ గారు మరియు అధికారులతో పల్నాడు జిల్లా ఎస్పీ శ్రీ రవిశంకర్ రెడ్డి ఐపీఎస్ చర్చించారు.