కాఫర్ డ్యాంలు పూర్తికాకుండా డయాఫ్రమ్ వాల్ నిర్మాణం చేపట్టడం చారిత్రిక తప్పిదం కాదా?సుత్తి లేకుండా సూటిగా సమాధానం చెప్పండి శ్రీ శ్రీ శ్రీ దేవినేని ఉమా మహేశ్వరావు గారు అని మునుపటి నీటి పారుదల శాఖ మంత్రిని తాజా మంత్రి అంబటి రాంబాబు ప్రశ్నించారు. దీనిపై స్పందించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు మాట్లాడుతూ... ఈ విషయం తెలుసుకోవడానికి మీ ప్రభుత్వానికి మూడు సంవత్సరాలు పట్టిందా మంత్రిగారు! మీకు అనుకూలమైన కాంట్రాక్టర్లు ఉంటే చాలు, మీ ముడుపులు మీకు అందితే చాలు అదే కదా మీ టీడీపీ, వైసీపీ పార్టీల ఆలోచనా విధానం? కేంద్రమంత్రి షెకావత్ గారు పర్యటన అనంతరం ఈ తప్పులన్నీ బయటకు వస్తున్నాయి అని ఆయన ఆరోపించారు.