తమిళనాడులోని వీసీసీ బ్యాంకు మేనేజర్ ఉమామహేశ్వరి (38)ని పోలీసులు తాజాగా అరెస్టు చేశారు. తప్పుడు ధ్రువీకరణ పత్రాలు అందించి, రూ.97 లక్షలను ఆమె కాజేసిందని పోలీసులు పేర్కొన్నారు. గతంలో గుడియాత్తం బ్రాంచి మేనేజర్‌గా ఉన్న సమయంలో పని చేస్తున్న బ్యాంకులోనే మోసానికి పాల్పడినట్లు తేలింది. ఆ నిధులతో ఆమె చెన్నైలో ఇళ్లు, ఇళ్ల స్థలాలు కొనుగోలు చేసినట్లు విచారణలో తెలిసింది.