యూపీలోని భాగ్పట్ ప్రాంతానికి చెందిన రణవీర్ సింగ్(45) అనే వ్యక్తికి పక్కింటి వాళ్లతో కొన్నాళ్లుగా గొడవలు జరుగుతున్నాయి. వారిపై ప్రతీకారం తీర్చుకోవాలని భావించాడు. ఇటీవల యూట్యూబ్ చూసి బాంబు తయారు చేశాడు. దానిని పరీక్షించి చూసి, ప్రత్యర్థి ఇంటి గుమ్మానికి బాంబు తగిలించాడు. బాధిత కుటుంబంలోని కుమారుడు గౌతమ్(17) తలుపు తీశాడు. అది పేలడంతో అతడికి తీవ్ర గాయాలయ్యాయి. ఎస్పీ నీరజ్ జాదౌన్ స్పందించి, నిందితుడిని శుక్రవారం అరెస్టు చేశారు.