కొందరు భార్యాభర్తలు చాలా అన్యోన్యంగా జీవిస్తుంటారు. ఇదే కోవలో భర్త చనిపోయిన కాసేపటికే అతడి భార్య ప్రాణాలను విడిచింది. ఏపీలోని విజయనగరం జిల్లా సాలూరు పట్టణంలో అల్లు చిన్న (72), విజయమ్మ (68) దంపతులు నివసిస్తున్నారు. అనారోగ్యంతో గురువారం చిన్న మృతి చెందాడు. ఈ విషయం తెలిసిన వెంటనే విజయమ్మ స్పృహ కోల్పోయింది. కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించగా శుక్రవారం కన్నుమూసింది. దీంతో వారింట్లో విషాదం నెలకొంది.