ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బుద్ధ వెంకన్న ను గృహానిర్బంధం చేసిన పోలీసులు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Jun 04, 2022, 02:28 PM

పల్నాడు జిల్లా జంగమేశ్వరపాడులో హత్యకు గురైన తెదేపా కార్యకర్త కంచర్ల జల్లయ్య అంత్యక్రియల్లో తెదేపా నేతలను పాల్గొననీయకుండా పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. జల్లయ్య అంత్యక్రియల్లో పాల్గొనేందుకు పార్టీ తరుపున త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసిన చంద్రబాబు. జిల్లా నేతలంతా కార్యక్రమంలో పాల్గొనాలని ఆదేశించారు. అధినేత చంద్రబాబు ఆదేశాల మేరకు మృతుని అంత్యక్రియల్లో పాల్గొనేందుకు, కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు ముగ్గురు సభ్యుల బృందాన్ని జంగమేశ్వరపాడు వెళ్లేందుకు నిర్ణయించారు.


తెదేపా తరుపున కొల్లు రవీంద్ర, బీద రవిచంద్ర, బుద్ధ వెంకన్న, జిల్లా ముఖ్య నేతలు కలిసి జల్లయ్య అంత్యక్రియల్లో పాల్గొనాల్సి ఉంది. అయితే. తెదేపా నేతలు రాకుండా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. విజయవాడలో తెదేపా నేత బుద్దా వెంకన్నను పోలీసులు గృహనిర్బంధించారు. పోలీసులు అడ్డుకోవడంతో బుద్ధా ఇంటి వద్దే నిరసనకు దిగారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com