ఝార్ఖండ్ రాష్ట్రం రామ్‌గఢ్ జిల్లాకు చెందిన దివ్య పాండే అనే యువతి సివిల్స్ రాసింది. ఇటీవల విడుదలైన ఫలితాలలో ఆమె పేరు ఉందని స్నేహితురాలు ఫోన్ చేసింది. వెబ్సైట్లో ఫలితాల కోసం చూస్తే సర్వర్ మొరాయించింది. ఇక స్నేహితురాలు చెప్పింది నిజమని నమ్మిన దివ్య ఈ సంతోషాన్ని అందరితోనూ పంచుకుంది. ఆమెకు జిల్లా స్థాయిలో ప్రముఖులు సన్మానాలు చేశారు. తీరా 323 ర్యాంకు దక్షిణాదికి చెంది పి.దివ్య అనే యువతికి వచ్చిందని అవాక్కైంది. పొరపాటు వల్లే జరిగినా బాధతో ఆమె కుమిలిపోతోంది.