ఓటీఎస్ (ఒన్ టైమ్ సెటిల్‌మెంట్) పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ప్రతి గ్రామంలో ఈ పథకాన్ని 100 శాతం పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అందుకేనెమో రెవెన్యూ, మండల పరిషత్, వెలుగు, పంచాయతీ ఇలా ఒకటేమిటి అన్ని శాఖల అధికారులు వారి వారి పరీసెంటేజీ పూర్తి చేసుకునేందుకు రెండు మూడు నెలలు గ్రామాల బాట పట్టారు. బుజ్జగించి, బతిమాలడి, బెదిరించి ఇల ఒకటేమిటి అన్ని రకాల ప్రయత్నాలు చేశారు అధికారులు.
వారు చెప్పిన మాటలకు ప్రజలు అప్పు చేసి పలు వస్తువులు తాకట్టు పెట్టి కొంత మంది కట్టారు. మరో కొంత మంది మా వాళ్ళ కాదు అంటే ఆయా గ్రామ సర్పంచ్, అదికారులు కట్టారు. ఇలా కాదు అని పొదుపు గ్రూప్ లలో ఉన్న మహిళ ఖాతాలో నగదు తీయించి , అప్పు ఇప్పించి మరి ఓటీఎస్ కు కట్టించి 70 శాతం, 80 శాతం 100 శాతం వారి టార్గెట్ పూర్తి చేసి హమ్మయ్య అని జిల్లా రాష్ట్ర అధికారులకు రిపోర్ట్ పెట్టి దులుపుకున్నారు.
తర్వాత ఏమిటి రా అంటే. ఏమో లబ్ధిదారులకు పట్టాలు లేవు, సమాధానం లేదు ఏంది మాకు పట్టాలు రాలేదు ఏమిటి అని అడిగితే మాకు తెలియదు. రెవిన్యూ వాళ్ళని అడుగు. వాళ్ళను అడిగితే. ఎంపిడిఓను అడుగు. అక్కడికి పోతే. వెలుగు వాళ్ళను అడుగు. ఆడికి పోతే గృహా నిర్మాణ శాఖ వాళ్ళను అడుగు. ఇలా ఒక చోటకు పోతే మరొక చోటికి. చివరికి సచివాలయంలో అడుగు అంటున్నారు. ఎక్కడికి వెళ్లాలో ఎవరిని అడగలో తెలియక అప్పులు చేసి మరీ కట్టిన నగదు లేక పట్టా రాక. లబో దిబో మంటున్నారు లబ్ధిదారులు.
ఈ విషయంపై తహసీల్దార్ అశోక్ కుమార్ రెడ్డి వివరణ కోరగా మండలం మొత్తం 1037 ఆన్ లైన్ ద్వారా వచ్చయాని అవి మొత్తం పంపిణీ చేయడం జరిగిందని ఆయన సెలవిచ్చారు. పట్టా కలిగిన స్థలానికి తిరిగి పట్టా ఇవ్వబడదని, అసైన్ మెంట్ స్థలం అయితే హౌసింగ్ లో వచ్చి ఉంటది కాబట్టి వాటికి అవసర లేదని ఆ సొమ్ము మాఫీ అవుతుందని తెలిపారు. ఏమైనా ఇంకా సమస్యలు ఉంటే పూర్తి అధికారం పంచాయతీ కార్యదర్శిని ఆయా గ్రామ కార్యదర్శిని సంప్రదించాలన్నారు.