విశాఖపట్నం ఉక్కు పరిశ్రమ పరిరక్షిణకు తాము అన్ని చర్యలు తీసుకుంటున్నామని స్థానిక ఎంపీ, టీడీపీ నాయకుడు ఎం. శ్రీభరత్ వెల్లడించారు. విశాఖ ఉక్కు పరిశ్రమకు సంబంధించిన పలు సమస్యలపై కేంద్ర ఉక్కు శాఖ మంత్రి హెచ్డీ కుమారస్వామితో ఎంపీ శ్రీభరత్ గురువారం సమావేశమై.. చర్చించారు.పరిశ్రమలోని ఉద్యోగుల వేతనాలు సమస్యను ఈ సందర్బంగా కేంద్ర మంత్రి దృష్టికి ఎంపీ శ్రీభరత్ తీసుకు వెళ్లారు. గత రెండు నెలలుగా పరిశ్రమలోని ఉద్యోగులకు జీతాలు అందక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మంత్రికి ఆయన వివరించారు. దీనిపై మంత్రి సానుకూలంగా స్పందించారు. తొందర్లోనే స్టీల్ ప్లాంట్‌కు సంబంధించిన అన్ని సమస్యలను పరిష్కారిస్తామని ఈ సందర్బంగా ఎంపీ శ్రీభరత్‌కు మంత్రి హెచ్ డీ దేవగౌడ హామీ ఇచ్చారు.అలాగే స్టీల్ ప్లాంట్‌కు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూసుకుంటామని ఎంపీకి మంత్రి హామీ ఇచ్చారు. ఇక విశాఖపట్నం స్టీల్ ప్లాంట్‌లో రెండో ఫర్నేస్ ప్రారంభించడానికి కృషి చేసిన కేంద్ర మంత్రి హెడీ కుమారస్వామిని ఎంపీ శ్రీభరత్ అభినందించారు.