బీసీలను బ్యాక్‌బోన్ క్లాస్‌లుగా గుర్తించిన ఏకైక ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి చరిత్రలో నిలిచారని వైయస్ఆర్సీపీ నేతలు పేర్కొన్నారు. వైయస్ఆర్సీపీ ప్రభుత్వ పాలనలో బీసీల సంక్షేమంలో ఆయన నిర్ణయాలు ఎందరికో ఆదర్శమని వెల్లడించారు. బడుగు, బలహీనవర్గాల అభ్యున్నతికి జీవితాంతం పాటు పడిన మహోన్నత మూర్తి మహాత్మా జ్యోతిరావు పూలే 134వ వర్థంతిని తాడేపల్లిలోని వైయస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. పార్టీ బీసీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ ఆర్.రమేష్‌యాదవ్, మాజీ మంత్రి జోగి రమేష్ తదితరులు పూలే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.