వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిలో అధికారం లేదన్న నిరాశ స్పష్టంగా కనిపిస్తుందని ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ తెలిపారు. గురువారం తాడేపల్లిలో వైఎస్ జగన్ ప్రెస్ మీట్ పెట్టి.. కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఈ నేపథ్యంలో ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. తన ప్రభుత్వ హయాంలో ఆరోగ్య రంగంలో 52 వేల మందిని నియమించామంటూ వైఎస్ జగన్ ప్రకటన చేయడం పచ్చి అబద్దమని ఆయన పేర్కొన్నారు. ఓ వేళ.. ఇది నిజమని నిరూపిస్తే.. తాను బహిరంగ క్షమాణలు చెబుతానంటూ వైఎస్ జగన్కు ఈ సందర్బంగా ఆయన సవాల్ విసిరారు.