ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై వైసీపీ అధినేత వైఎస్ జగన్ సీరియస్ అయ్యారు. చంద్రబాబు హయాంలో రాష్ట్రం తిరోగమనంలో పయనిస్తోందన్నారు. స్టేట్‌లో డిస్కంలు దయనీయ స్థితికి వెళ్లాయని చెప్పారు. ఏకంగా రూ.89 వేల కోట్ల నష్టాలు వచ్చాయని తెలిపారు. తమ హయాంలో డిస్కంలను నిలబెట్టే ప్రయత్నం చేశామన్నారు వైసీపీ అధినేత. కానీ టీడీపీ ప్రభుత్వంలో డిస్కంల అప్పులు పెరిగాయన్నారు. రెడ్‌బుక్ పాలనతో రాజ్యాంగానికి తూట్లు పొడుస్తున్నారని జగన్ మండిపడ్డారు. వైసీపీ హయంలో పగటిపూటే 9 గంటల పాటు ఫ్రీ కరెంట్ ఇచ్చామని జగన్ వ్యాఖ్యానించారు. కానీ కూటమి సర్కారు రైతులకు ఉచిత కరెంట్ ఇవ్వలేకపోతోందని ధ్వజమెత్తారు. చంద్రబాబు పాలనలో డిస్కంల అప్పులు పెరిగాయన్నారు. ఎక్కడ చూసినా మాఫియా రాజ్యం నడుస్తోందన్నారు. చంద్రబాబు హయాంలో గ్రామ సచివాలయ వ్యవస్థ అగమ్యగోచరంగా మారిందన్నారు జగన్.