ఉత్తరప్రదేశ్లోని మహోబా జిల్లాలో ఓ మహిళ మగబిడ్డకు జన్మనివ్వలేదని దారుణంగా అత్తమామలు కొట్టారు. దుర్భాషలాడుతూ కాలితో తన్నిన వీడియోలు నెట్టింట వైరల్ అయ్యాయి. దీనిపై శనివారం జిల్లా ఎస్పీ సుధా సింగ్ స్పందించారు. బాధితురాలి భర్త నీరజ్, మరిది కరియా, అత్తమామలు, మరో ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. తన జననాంగాలపై దారుణంగా కొట్టారని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది.