జమ్మూకాశ్మీర్ లోని హంద్వారాలో పర్వైజ్ అనే బాలుడు ఒంటి కాలుతో స్కూల్ కి వెళ్తున్నాడు. అతను స్కూల్ కి వెళ్లాలంటే ఒంటికాలిపై బ్యాలెన్స్ చేసుకుంటూ 2 కిలోమీటర్ల దూరం ప్రయాణించాల్సి ఉంటుంది. తమకు రోడ్లు బాగోలేవని, తాను కృత్రిమ కాలును తీసుకుంటే నడవగలనని పర్వైజ్ చెబుతున్నాడు. తన జీవితంలో ఏదైనా సాధించాలనే కల ఉందని పర్వైజ్ తెలిపాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa