ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అది ఆడవారిని మర్యాదకు భంగం కలిగించేదిగా ఉంది

national |  Suryaa Desk  | Published : Sat, Jun 04, 2022, 10:17 PM

డియోడరెంట్ యాడ్ పై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించింది. కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ ఓ డియోడరెంట్ యాడ్ పై కొరడా ఝుళిపించడానికి కారణం ఎంటో తెలుసా. లేయర్ కంపెనీ తన 'షాట్' డియోడరెంట్ బాడీ స్ప్రేకు ప్రచారం కల్పించేందుకు రూపొందించిన యాడ్ లో మహిళలను వారి మర్యాదకు భంగం కలిగించేలా చిత్రీకరించారని కేంద్రం భావిస్తోంది. 


ఈ నేపథ్యంలో సదరు డియోడరెంట్ యాడ్ పై నిషేధం విధించింది. అడ్వర్టయిజింగ్ నియమావళిని అనుసరించి దీనిపై విచారణకు ఆదేశించింది. అంతేకాదు, యూట్యూబ్, ట్విట్టర్ లకు కూడా కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ లేఖలు రాసింది. ఆ యాడ్ ను తొలగించాలని ఆదేశించింది. 


సోషల్ మీడియాలో ఈ యాడ్ పై తీవ్ర దుమారం చెలరేగింది. ఓ క్రికెట్ మ్యాచ్ సందర్భంగా ఈ యాడ్ ప్రసారం కాగా, మహిళలపై అత్యాచారాలకు పురిగొల్పే విధంగా ఆ యాడ్ ఉందని నెటిజన్లు మండిపడుతున్నారు. అటు, అడ్వర్టయిజింగ్ కౌన్సిల్ ఆఫ్ ఆండియా (ఏఎస్ సీఐ) కూడా దీనిపై స్పందించింది. ఈ యాడ్ ఏఎస్ సీఐ నియమావళిని తీవ్రస్థాయిలో ఉల్లంఘించిందని పేర్కొంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa