టెన్త్ పరీక్షల వ్యవహారంలో వైసీపీ, టీడీపీ మధ్య వివాదం ముదురుతోంది. అమ్మఒడి డబ్బులు ఇవ్వలేకే టెన్త్ విద్యార్థులను ప్రభుత్వం ఫెయిల్ చేసి ఉంటుందనే అనుమానం ట్విట్టర్లో లోకేష్ వ్యక్తం చేశారు. దీనికి ఎంపీ విజయసాయి ట్విట్టర్లోనే కౌంటర్ ఇచ్చారు. దిగజారి ఆరోపణలు చేయడంలో ముందుంటావని, చదువు 'కొన్న' వాడికి దాని విలువ ఏం తెలుస్తుందని ప్రశ్నించారు. టెన్త్ ఉత్తీర్ణత శాతం తగ్గడానికి నారాయణ సంస్థలు పేపర్ లీక్ చేయడమే కారణమన్నారు.