అమరావతిలోని వెంకటపాళెంలో శ్రీవారి ఆలయంలో టీటీడీ నిర్మించిన శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయ మహాసంప్రోక్షణ కార్యక్రమాల్లో రెండో రోజు శాస్త్రోక్తంగా క్షీరాధివాసం నిర్వహించారు. ఇందులో భాగంగా ఉదయం స్వామివారి శక్తిని నింపిన కుంభాలకు ప్రత్యేక ఆరాధన నిర్వహించారు. అనంతరం ఉక్త హోమాలు, క్షీరాధివాసం చేపట్టారు. శ్రీవారి విగ్రహనికి వేద మంత్రాల మధ్య పాలతో విశేషంగా అభిషేకం చేయడం వల్ల దోషాలు తొలగిపోతాయని ఆలయ అర్చకులు తెలిపారు. సాయంత్రం హోమాలు, యాగశాల వైదిక కార్యక్రమాలు చేపట్టారు.ఈ కార్యక్రమంలో తిరుమల శ్రీవారి ఆలయ ప్రధానార్చకులు వేణుగోపాలదీక్షితులు, వైఖానస ఆగమ సలహాదారు వేదాంతం విష్ణుభట్టాచార్యులు, డిప్యూటీ ఈఓ గుణభూషణ్‌రెడ్డి, ధార్మిక ప్రాజెక్టుల అధికారి విజయసారథి, ఏఈఓ దొరస్వామి నాయక్ తదితరులు పాల్గొన్నారు.