భర్తతో కలిసి హాలిడే ట్రిప్ కోసం గోవా వచ్చిన బ్రిటన్ మహిళపై అత్యాచారం జరిగింది. జూన్ 2న గోవాలోని అరంబోల్ స్వీట్ వాటర్ బీచ్ వద్ద ఉన్న సమయంలో స్థానికంగా ఉండే 32 ఏళ్ల నిందితుడు ఆమెపై అత్యాచారం చేశాడు. ఈ విషయాన్ని భర్తకు ఆ మహిళ చెప్పింది. వారిద్దరూ గోవా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. నిందితుడిని సోమవారం అరెస్టు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa