వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, ప్రజాప్రతినిధులు, అధికారులు చేపట్టిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వివిమాగంగా కొనసాగుతుంది. మంగళవారం అనగా ఈ రోజు అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గంలోని విడపనకల్లు మండలం చీకులగురికి గ్రామంలో "గడపగడపకు మన ప్రభుత్వం" కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ఉరవకొండ నియోజకవర్గ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా గ్రామస్తులు ఆయనకు స్వాగతం పలికారు. మూడేళ్ల వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ప్రతి ఇంటికి చేసిన మేలును విశ్వేశ్వరరెడ్డి గడప గడపలో వివరించారు.