ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన వైయస్ఆర్ యంత్ర సేవ పథకంలో భాగంగా ఈ రోజు కర్నూలు జిల్లా రైతులకు నగరంలోని ఎస్టిబిసి గ్రౌండ్లో ట్రాక్టర్లను పంపిణీ చేశారు. కర్నూలు జిల్లా కలెక్టర్ పి.కోటేశ్వరావు , నగర మేయర్ బి.వై. రామయ్య , పత్తికొండ శాసనసభ్యురాలు కంగాటి శ్రీదేవమ్మ, పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి, కర్నూలు నగర ఎమ్యెల్యే ఎం.ఏ.హఫీజ్ ఖాన్ , కోడుమూరు ఎమ్యెల్యే జె.సుధాకర్ బాబు, ఎం.పి. సంజీవ్ కుమార్,జె.సి. రామ్ సుందర్ రెడ్డి, కమిషనర్ భార్గవ్ తేజ,జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్ బెల్లం మహేశ్వర రెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీదేవమ్మ పత్తికొండ నియోజకవర్గం లోని రైతు గ్రూపులకు మంజూరైన 19 ట్రాక్టర్లు లను, ఇంప్లిమెంట్ లను రైతు గ్రూప్ లకు అందజేశారు.