కారు ఉందనే గర్వంతో ఓ వ్యక్తి దారుణంగా వ్యవహరించాడు. హై స్పీడులో పోనిచ్చి ఓ బైకర్‌ను కావాలనే ఢీకొట్టాడు. ఈ ఘటన ఢిల్లీలోని అర్జంఘర్ మెట్రో స్టేషన్ సమీపంలో జరిగింది. రాయల్ ఎన్ఫీల్డ్ నడుపుతున్న శ్రీయాన్ష్ అనే వ్యక్తికి, స్కార్పియో నడుపుతున్న అనుజ్ చౌదరికి స్వల్ప వివాదం జరిగింది. పట్టరాని కోపంతో తన స్కార్పియోతో శ్రీయాన్ష్ను అనూజ్ ఢీకొట్టాడు. దీనిని వీడియో తీసిన ఓ నెటిజన్ ట్విట్టర్లో పీఎంఓకు, సీఎం కేజ్రీవాల్, పోలీసులకు ట్యాగ్ చేశాడు. అనూజ్‌పై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు దృష్టికి వెళ్లడంతో నిందితుడిని అరెస్టు చేశారు.