ఏపీలోని అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్‌లో ఇటీవల విష వాయువుల లీక్ అయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో విషవాయులు లీక్ అయిన పోరస్ కంపెనీకి తాజాగా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు షాకిచ్చింది. తాము తుది ఉత్తర్వులు ఇచ్చే వరకు ఫ్యాక్టరీలో కార్యకలాపాలన్నింటినీ నిలిపి వేయాలని పీసీబీ ఛైర్మన్ ఏకే ఫరీదా ఆదేశాలిచ్చారు. సాయంత్రం లోగా దీనిపై ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కెమికల్ ఇంజినీరింగ్ నిపుణులు నివేదిక ఇస్తారని, దాని ఆధారంగా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.